News October 6, 2025
ఈ నెల 8న ఉమ్మడి ADB సెపక్ తక్రా ఎంపికలు

రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్‌లోని సింగరేణి గ్రౌండ్‌లో ఈ నెల 8న సెపక్ తక్రా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ తెలిపారు. అండర్ 14, అండర్ 19 విభాగాలలో ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలలోగా గ్రౌండ్‌కు చేరుకోవాలని సూచించారు.
Similar News
News January 18, 2026
అన్నమయ్య జిల్లాలో అద్భుత దృశ్యం

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యం ఆదివారం ఉదయం ఆవిష్కృతమైంది. ఏటా కార్తీక మాసం, మాఘమాసంలో భానుడి కిరణాలు శివలింగాన్ని తాకుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. స్వామివారికి అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున పూజలు, అభిషేకాలు చేశారు.
News January 18, 2026
TU: B.P.Ed ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

టీయూ పరిధిలోని B.P.Ed మొదటి, మూడవ సెమిస్టర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ విడుదల చేశారు. ఈ నెల 25న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ ఫీల్డ్, జిమ్నాస్టిక్, ఫుట్ బాల్, టెన్నిస్, త్రో బాల్,కరాటే, బాస్కెట్ బాల్, బాడ్మింటన్, ఖోఖో, రెస్లింగ్, బాక్సింగ్ లతో పాటు టీచింగ్ ప్రాక్టీస్, మాస్ డిమానిస్ట్రేషన్ నిర్వహించనున్నారు.
News January 18, 2026
విశాఖ పోర్టుకు మరో రికార్డు

విశాఖ పోర్టు మరో చారిత్రక రికార్డు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేవలం 289 రోజుల్లోనే 70 మిలియన్ టన్నుల (7,01,74,002 టన్నులు) సరకు రవాణా పూర్తి చేసింది. 2026 జనవరి 14 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. పోర్టు ఏర్పాటైన 92 ఏళ్లలో ఇంత తక్కువ సమయంలో ఇంత భారీగా సరకు రవాణా ఇదే తొలిసారి. గతంలో 2024-25లో 316 రోజులు, 2023-24లో 320 రోజులు పట్టాయి.


