News November 5, 2025

ఈ ఫేస్ ప్యాక్‌తో ఎన్నో లాభాలు

image

పెరుగు, శనగపిండి, పసుపు మూడు కలిసి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నాయి. వీటిని కలిపి ప్యాక్‌లా తయారుచేసుకుని ముఖానికి, చర్మానికి పట్టించడం వల్ల సౌందర్యం పెరుగుతుంది. చర్మంపై చేరే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి. కెమికల్ క్రీములు వాడే బదులు వీటిని వాడటం వల్ల చర్మ సౌందర్యాన్ని సులువుగా పెంచుకోవచ్చని చెబుతున్నారు.

Similar News

News January 22, 2026

వాయల్పాడు, పీలేరు PSలను తనిఖీ చేసిన SP

image

అన్నమయ్య జిల్లాలోని పలు PSలను బుధవారం SP పరిశీలించారు. వాయల్పాడు, పీలేరు పోలీస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, లాకప్, పరిసరాలను పరిశీలించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, రాత్రి గస్తీ పెంచాలని, మహిళలు–పిల్లల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఓటీపీ మోసాలపై అప్రమత్తంగా ఉండి, మోసం జరిగితే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

News January 22, 2026

HEADLINES

image

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర

News January 22, 2026

అభిషేక్… రికార్డులు షేక్

image

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.