News August 4, 2024
ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ తొలగించబడింది
నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.12787, 12788 ట్రైన్‌లను ఆగస్టు 3 -10 వరకు విజయవాడ మీదుగా కాక రామవరప్పాడు- రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆయా రోజుల్లో ఈ రైళ్లకు విజయవాడలో స్టాప్ లేదని, సమీపంలోని రామవరప్పాడులో ఈ రైళ్లకు స్టాప్ ఇచ్చామన్నారు.
Similar News
News September 18, 2024
విజయవాడ: మంత్రి నిమ్మలను కలిసిన పలువురు నేతలు
విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడును మాజీ ఎంపీ, లైలా గ్రూప్ ఛైర్మన్, గోకరాజు గంగరాజు, ఎస్ఎల్‌వీ గ్రూప్ ఛైర్మన్ శ్రీనివాసరాజు, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడును వారు సత్కరించారు. అనంతరం బుడమేరు వరద కారణంగా కేసరపల్లిలో ముంపుకు గురైన ఎస్ఎల్‌వీ లైలా గ్రీస్ మెడోస్ కాలనీవాసులకు భవిష్యత్తులో తమ నివాసాలవైపు వరద నీరు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
News September 18, 2024
భవానీపురంలో నేడు పవర్ కట్
భవానీపురం సబ్ స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీ.వీ సుధాకర్ తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు టీచర్స్ కాలనీ, అప్నా బజార్ రోడ్డు, ఇందిరా ప్రియదర్శినీ కాలనీ, దర్గాప్లాట్లు, హెచ్బీ కాలనీలోని 450 ఎస్ఎఫ్ఎ బ్లాక్ వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
News September 18, 2024
రేపు విజయవాడలో షర్మిల నిరాహార దీక్ష
విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్షలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ, శివసేన పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు ఆమె నిరసనగా దీక్ష చేపట్టనున్నారు. బీజేపీ, శివసేన నేతలు క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేయనున్నారు.