News December 1, 2025
ఉంగుటూరు చేరుకున్న మంత్రి నాదెండ్ల

ఉంగుటూరు నియోజకవర్గం పర్యటనలో భాగంగా మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొల్లగూడెం చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సభా ప్రాంగణానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధర్మరాజు, బాలరాజు పాల్గొన్నారు.
Similar News
News February 12, 2026
విశాఖ: సహజీవన భాగస్వామిని హత్య చేసిన మహిళ?

ఆనందపురం శివారున పందుల పాక వద్ద <<19110634>>నాగశివ<<>> (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలిని పరిశీలించారు. నాగశివ ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యకు గురయ్యాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాగశివ ముబీనా అలియాస్ శ్రావణి (41)తో సహజీవనం చేస్తున్నాడు. మద్యం మత్తులో వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో శ్రావణి దాడి చేసి చంపినట్లు సమాచారం.
News February 12, 2026
US హౌస్‌లో ట్రంప్‌కు షాక్.. కెనడాకు మద్దతుగా ఓటింగ్

US హౌస్ సభ్యులు ట్రంప్‌కు షాకిచ్చారు. <<18949938>>కెనడా<<>>పై విధించిన టారిఫ్స్‌ను తిరస్కరిస్తూ ఓటు వేశారు. డెమొక్రాట్లు తీసుకొచ్చిన తీర్మానం 219-211 తేడాతో నెగ్గింది. ఆరుగురు రిపబ్లికన్లు(ట్రంప్ పార్టీ) కూడా అనుకూలంగా ఓటేయడం గమనార్హం. అయితే దీనికి సెనేట్, ట్రంప్ ఆమోదం తప్పనిసరి. కానీ ట్రంప్ వీటో చేసే అవకాశం ఉంది. సుంకాలను వ్యతిరేకించే రిపబ్లికన్లపై ఎన్నికల సమయంలో చర్యలు తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
News February 12, 2026
తూ.గో: ఆ 40 మందిలో మీ MLA ఉన్నారా..?

NDA ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి తూ.గో. జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా.. అయితే కామెంట్ చేయండి.


