News April 21, 2024

ఉండి టీడీపీ కంచుకోట.. గెలిచి తీరుతా: RRR

image

ఉండిలో ఎంతమంది అడ్డొచ్చినా MLAగా గెలిచి తీరుతానని రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేతులమీదుగా ఉండి అభ్యర్థిగా బీఫాం అందుకున్న రఘురామ.. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. ఉండిలో మంతెన రామరాజుతో కలిసి ముందుకు సాగుతానని అన్నారు. ఉండి టీడీపీ కంచుకోట అని, టీడీపీ-జనసేన్-బీజేపీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వెళ్లి జెండా ఎగురవేస్తానని అన్నారు.

Similar News

News December 11, 2025

యూత్ హాస్టల్స్ కోరల్ జూబిలీ సావనీర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరల్ జూబిలీ సావనీర్‌ను కలక్టరేట్‌లో గురువారం కలెక్టర్ నాగరాణి ఆవిష్కరించారు. భీమవరం యూనిట్ దక్షిణ భారత దేశంలో 2వ అతిపెద్ద యూనిట్‌గా అభివృద్ధి చేసినందుకు కార్యవర్గాన్ని అభినందించారు. ట్రెక్కింగ్, రాప్టింగ్, హైకింగ్, పారా గ్రైండింగ్, రాఖ్ క్లైమ్బింగ్ వంటి అడ్వెంచర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామని యూనిట్ ఛైర్మన్ మట్లపూడి సత్యనారాయణ కలెక్టర్‌కు వివరించారు.

News December 11, 2025

ఆకివీడు: రూ.5 వేలకే గ్రాము బంగారం అంటూ మోసం..!

image

ఆకివీడులో ఓ ముఠా గ్రాము బంగారం రూ.5 వేలకే ఇస్తామని నమ్మించి మోసానికి తెరలేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. తక్కువ ధరకే బంగారం వస్తుందని ఆశపడిన భీమవరం, హైదరాబాద్ యువకులు ఆకివీడు వచ్చి రూ.2.50 లక్షలు చెల్లించారు. తీరా చూసుకుంటే అది నకిలీ బంగారమని తేలింది. బాధితులు తిరిగి వెళ్లి నిలదీయగా, రూ.1.20 లక్షలు వెనక్కి ఇచ్చి రాజీ కుదుర్చుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

News December 11, 2025

ఈనెల 15 న ప్రారంభం కానున్న నరసాపురం- చెన్నై వందేభారత్ రైలు

image

నరసాపురం నుంచి చెన్నైకు నూతన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రైలు నర్సాపురంలో మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి రాత్రి 11:45 గంటలకు చెన్నై చేరుకుంటుంది. ఈ రైలు భీమవరం, గుడివాడ, విజయవాడ, తెనాలి ,ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, మీదుగా ప్రయాణిస్తుంది. ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఒక నెల ముందుగానే ప్రారంభిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.