News March 23, 2024
ఉండి మాజీ ఎమ్మెల్యే శివపై కేసు నమోదు

ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కేసు నమోదైంది. పాలకోడేరు ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఈ నెల 20న పాలకోడేరు మండలంలో శివరామరాజు సుమారు 30 వాహనాలతో ఊరేగింపు నిర్వహించారని, అందుకు ముందస్తు అనుమతి తీసుకోలేదని ఎస్సై తెలిపారు. దీనిపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారం మేరకు పాలకోడేరు తహశీల్దార్ నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News April 14, 2026
పాలకోడేరు: ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి

గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణంలో అంబేడ్కర్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 14, 2026
TPG: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ సంఘటన తాడేపల్లిగూడెం మండలం పడాల ఒక పత్రిక కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు వివరించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.


