News December 25, 2024
ఉండి: శ్రీధర్ ఇంట్లో మరో చెక్కపెట్టె..?
డెడ్‌బాడీ పార్శిల్ ఘటనలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. పర్లయ్యను చంపిన శ్రీధర్ వర్మ.. ఆ డెడ్‌బాడీని ఓ చెక్కపెట్టెలో పెట్టి తులసి ఇంటికి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రీధర్ వర్మను విచారిస్తున్న పోలీసులు అతడి ఇంటిని పరిశీలించారు. అక్కడ మరో చెక్కపెట్టె, చేతబడి సామాన్లు దొరికినట్లు తెలుస్తోంది. దేనికోసం రెండో చెక్కపెట్టెను శ్రీధర్ రెడీ చేశాడని ఆసక్తి రేపుతోంది.
Similar News
News January 25, 2025
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించి ఎమ్మెల్యే రాధాకృష్ణ
సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 1న తణుకులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామంలో పర్యటించారు. తణుకు మండలంలోని తేతలి తవ్వ గ్రామాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్థలాలను పరిశీలించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆయా ప్రాంతాల్లో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు.
News January 25, 2025
నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష
ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.
News January 25, 2025
పశువధను నిలిపివేయాలని కలెక్టర్‌కి మహిళలు విజ్ఞప్తి
తణుకు మండలం తేతలిలో లేహం ఫుడ్స్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ స్థానిక మహిళలు జిల్లా కలెక్టర్ నాగరాణికు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి తణుకులోని రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కలెక్టర్ నాగరాణిను కలిసిన వారు తణుకులో పశు వధ కర్మగారం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.