News August 12, 2025
‘ఉచిత బస్సు ప్రయాణం’తో విద్యార్థులకు కష్టాలు..!

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉచిత బస్సు ప్రయాణం’ విద్యార్థులకు సమస్యగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి మెదక్‌లో ఈ పథకాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. బస్సులలో రద్దీ పెరిగి,కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వందల సంఖ్యలో మహిళలు బస్సులో ప్రయాణించడం వల్ల విద్యార్థులకు కష్టంగా మారింది. దీనివల్ల తరగతులకు సమయానికి చేరుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
Similar News
News March 17, 2026
BIG BREAKING: KNR: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను: జీవన్‌రెడ్డి

తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈరోజు జగిత్యాలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ను వదిలితే ఫ్లెక్సీలు ఏంటి అన్నీ మారతాయన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ వదిలితే ఎందులో చేరాలో ఆలోచిస్తానన్నారు. తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం MLA సంజయ్ అని, కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్నారు. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
News March 17, 2026
రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే: ఆది శ్రీనివాస్

రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.20,616 కోట్లను ఏకకాలంలో మాఫీ చేశామని అన్నారు. దీంతో సుమారు 25 లక్షల మంది రైతులు కొత్తగా రుణం పొందే అవకాశం కల్పించామన్నారు. రైతు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రైతు అన్నారు.
News March 17, 2026
జగిత్యాల మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అమావాస్య, ఉగాది సందర్భంగా మార్చి 18, 19వ తేదీల్లో మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్చి 20 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు గమనించి సహకరించాలని కోరారు.


