News September 9, 2025

ఉట్నూర్: ‘ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం’

image

ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో 50 సీసీ టీవీ కెమెరాలతో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ కలిసి ప్రారంభించారు. నిష్ణాతులైన సిబ్బంది ద్వారా 24 గంటలు పర్యవేక్షిస్తామని తెలిపారు. రాత్రి సమయంలోనూ దృశ్యాలు కనిపిస్తాయన్నారు.

Similar News

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 58.17% పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 58. 17% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 58.00 శాతం, బేల 59.09, జైనథ్‌ 56.45, బోరజ్‌ 55.49, భీంపూర్‌ 59.99, సాత్నాల 63.46, తాంసి 57.30, మావలలో 53.06 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

News December 14, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 21.80% పోలింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.80% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 20.05 బేల 19.63, జైనథ్‌19.42, బోరజ్‌ 23.60, భీంపూర్‌ 24.93, సాత్నాల 28.00, తాంసి 24.26, మావలలో 16.40 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

News December 14, 2025

ఆదిలాబాద్: నేడే పోలింగ్.. మీరు రెడీనా?

image

జిల్లాలో నేడు జరిగే 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 17 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలు జరిగే 8 మండలాల్లో ఆదిలాబాద్(R)లో 4, బేల 1, జైనథ్‌ 1, బోరజ్‌ 1, భీంపూర్‌ 5, సాత్నాల 2, తాంసిలో ముగ్గురు సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉ.7గంటల నుంచి మ.1 వరకు పోలింగ్.. మధ్యాహ్నం ఫలితాలు ప్రకటిస్తారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.