News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్‌ను అభినందించారు.
Similar News
News March 13, 2026
SKU నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా జ్యోతి కుమార్

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నూతన వైస్ ఛాన్స్‌లర్‌గా NVR జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మిజోరాం యూనివర్సిటీలో కామర్స్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటి నుంచి 3 ఏళ్ల పాటు ఈయన వైస్ ఛాన్స్‌లర్‌గా కొనసాగనున్నారు.
News March 13, 2026
అనంత: ‘బాలుడి హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు’

అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల వల్ల 2022లో బాలుడిని ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. సెట్టూరు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.70/2022 u/s 302 r/w 34 IPC సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడి హత్య కేసులో ముగ్గురికి (చిట్టప్ప, ఈరన్న, ముకుందప్ప) కఠిన జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
News March 13, 2026
భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.


