News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న పలు సమీక్షల అనంతరం విజయనగరం చేరుకొని రామనారాయణాన్ని సందర్శిస్తారు. 27న పైడితల్లమ్మని దర్శించుకొని కలెక్టరేట్లో అధికారులతో సమావేశమవుతారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.
Similar News
News January 17, 2026
VZM: పండగకి ఇంత తాగేశారా..!

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
News January 17, 2026
విజయనగరం జిల్లా మీదుగా అమృత్ భారత్ స్లీపర్ ట్రైన్..రేపట్నుంచే

రైలు ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. (02609) ట్రైన్ న్యూజల్ పాయ్ గురి నుంచి విజయనగరం మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ నడుస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురిలో 1:45ని.లకు బయలదేరి విజయనగరానికి 1:25లకు చేరుకుంటుంది.