News November 19, 2025

ఉత్త‌రాంధ్ర‌లో అంచ‌నాల కమిటీ ప‌ర్య‌ట‌న‌

image

AP అంచ‌నాల క‌మిటీ ఈనెల 25-29 వ‌రకు ఉత్త‌రాంధ్రలో ప‌ర్య‌టించ‌నుంది. ఛైర్మ‌న్ వేగుళ్ల జోగేశ్వ‌రరావు అధ్య‌క్ష‌త‌న క‌మిటీ స‌భ్యులు 25న విశాఖ‌ చేరుకుంటారు. 26న పలు సమీక్షల అనంతరం విజయనగరం చేరుకొని రామనారాయ‌ణాన్ని సందర్శిస్తారు. 27న పైడిత‌ల్లమ్మని ద‌ర్శించుకొని క‌లెక్ట‌రేట్లో అధికారుల‌తో స‌మావేశ‌మవుతారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మీక్షిస్తారు.

Similar News

News January 17, 2026

VZM: వాట్సాప్‌లో పోలీస్ సేవలు.. నంబర్ ఇదే!

image

విజయనగరం జిల్లాలో ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా సేవలు పొందవచ్చని SP దామోదర్ శనివారం తెలిపారు. ‘మనమిత్ర’ విధానం ద్వారా FIR కాపీలు, ఈ-చలాన్ స్థితిని ఇంటి నుంచే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో త్వరితగతిన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు.

News January 17, 2026

రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా రణస్థలం జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. మృతుడు నెల్లిమర్ల (M) తమ్మాపురం గ్రామానికి చెందిన కోటి(25)గా గుర్తించారు. తల్లిని శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. దీనిపై జె.ఆర్‌పురం పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 17, 2026

VZM: పండగకి ఇంత తాగేశారా..!

image

విజయనగరం జిల్లాలో సంక్రాంతి పండగ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సంక్రాంతి, కనుమ పండుగ రోజుల్లో మందుబాబులు వైన్ షాపులు, బార్లకు క్యూ కట్టారు. ఏకంగా రూ.13.81 కోట్ల మద్యాన్ని ఫుల్‌గా తాగేశారు. జిల్లాలో 225 మద్యం షాపులు, 26 బార్లు ఉన్నాయి. ఈనెల 13,14 తేదీల్లో 52,090 కేసుల ఐఎంఎల్ మద్యం, 16న 485 బీర్ కేసుల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.