News August 24, 2024
ఉత్తర తెలంగాణకు ఎంజీఎం పెద్ద దిక్కు!

వరంగల్ ఎంజీఎం ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా ఉంది. రోజూ సగటున ప్రతి 30 సెకండ్లకు ఒక రోగి ఇక్కడ చేరుతున్నాడు. కరోనా సమయంలో లక్ష మంది రోగులకు సేవలు అందించారు. ఇది 1954లో ప్రారంభం కాగా.. 70 ఏళ్లలో 7,12,92,000 మంది రోగులకు వైద్య సేవలు అందించింది. ఇక్కడ మొత్తం 25 వైద్య విభాగాలు ఉన్నాయి. ప్రతిరోజు సేవలకు ఎంజీఎం చేసే ఖర్చు రూ.1.75 కోట్లు. ఇవీ ఎంజీఎం విశేషాలు.
Similar News
News January 23, 2026
వరంగల్ RJDగా లక్ష్మణుడు బాధ్యతల స్వీకరణ

మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా హైదరాబాదులో అదనపు డైరెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మణుడు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న RJD ఉప్పుల శ్రీనివాస్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం లక్ష్మణుడిని వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. వరంగల్ RJDగా బాధ్యతలు తీసుకున్న లక్ష్మణుడికి మార్కెటింగ్ శాఖ అధికారులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
News January 21, 2026
WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
News January 21, 2026
వరంగల్: ‘స్కాలర్‌షిప్ విద్యార్థులు ఆధార్ లింకు చేసుకోవాలి’

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.


