News February 10, 2025
ఉత్సాహంగా ఉత్తరాంధ్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరులో ఆదివారం మోదకొండమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు జరిగాయి. కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా చోడవరం సీడీసీ ఛైర్మన్ శ్రీనివాసరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
Similar News
News February 17, 2026
కుక్కలా నడుస్తుంది.. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది..

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో రోబో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. TCS అభివృద్ధి చేసిన ఈ రోబో కుక్కలా నడుస్తుంది. ఇంజినీర్‌లా ఆలోచిస్తుంది. రిస్కీ ప్రాంతాల్లో ప్రమాదాలు, తప్పిదాలను నివారించడమే ఈ ఆవిష్కరణ ఉద్దేశమని కంపెనీ చెబుతోంది. కంప్రెసర్లు, ఎలక్ట్రికల్ ప్యానల్స్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమస్యలను, గ్యాస్ లీకేజ్, వెల్డింగ్ లోపాలనూ గుర్తించగలదు. కష్టతరమైన జోన్లలోనూ పని చేస్తుందట.
News February 17, 2026
శుక్ర మౌఢ్యమి ముగుస్తోంది కానీ!

ఈరోజుతో శుక్ర మౌఢ్యమి ముగియడంతో శుభకార్యాలు మొదలవనున్నాయి. అయితే ఈ మంచి రోజులు మే 9 వరకు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మే 17 నుంచి జూన్ 15 వరకు అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం. అలాగే మే 4 నుంచి 29 వరకు కర్తరీ దోషం ఉంది. ఈ సమయంలోనూ శుభకార్యాలు చేయరు. దీంతో మే నెలలో గృహారంభం, గృహప్రవేశం వంటి పనులు చేయరాదు. కాబట్టి ఈ లోపు మీ పనులు ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.
News February 17, 2026
కర్నూలు: అడవిలో మహిళ హత్య.. సంచలన తీర్పు!

గోనెగండ్ల మండలం బి.అగ్రహారం గ్రామానికి చెందిన దేవదాసుకు బైలుప్పలకు చెందిన లక్ష్మిని హత్య చేసిన కేసులో సోమవారం జీవిత ఖైదు పడింది. 2021లో మహిళ కనిపించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముద్దాయిని అరెస్ట్ చేసి విచారించారు. కసాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్యచేసి శవాన్ని కాల్చినట్లు వెల్లడైంది. కేసును విచారించిన ఆదోని 2వ అదనపు జిల్లా జడ్జి నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించారు.


