News August 11, 2025

ఉదయగిరి పేరుతో INS భారత యుద్ధ నౌక

image

ఈనెల 26వ తేదీన విశాఖపట్నంలో INS ఉదయగిరి పేరుతో స్టెల్త్ ఫ్రిగేట్ ను భారత నౌకాదళం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీంతో ఉదయగిరికి అరుదైన, అద్భుతమైన అవకాశం దక్కింది. F35 పేరుతో రూపుదిద్దుకుంటున్న భారత యుద్ధ నౌకకు చారిత్రక నేపథ్యం ఉన్న ఉదయగిరి పేరు పెట్టడం విశేషం.149 మీటర్ల పొడవుతో 40 మిస్సైళ్లు ప్రయోగించేలా రూ.600 కోట్లతో ఈ నౌకను తయారు చేశారు.

Similar News

News March 14, 2026

సూళ్లూరుపేట: కళ్లలో కారం కొట్టి బంగారం దోపిడీ

image

సూళ్లూరుపేట కచేరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోల్డ్ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.30 లక్షల విలువైన బంగారు నగలను అపహరించుకొని పరారయ్యాడు. ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 14, 2026

నెల్లూరు: రైతన్నలూ.. వాళ్లతో జాగ్రత్త!

image

ఎండనక, వాననక తమ రక్తాన్ని చెమటగా మార్చి రైతన్నలు పంటలు పండిస్తారు. మార్కెట్లో పంట అమ్ముకునే సమయంలో కొంతమంది దళారుల మాయ మాటలు నమ్మి మోసపోతారు. నగదు త్వరగా చెల్లిస్తామని నమ్మబలికి పంటలను కొనుగోలు చేసే దళారులు రైతులను నట్టేట ముంచిన ఘటనలు చాలా జరిగాయి. ఇప్పటికైనా నెల్లూరు జిల్లా రైతులు దళారులను నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News March 14, 2026

నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

image

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.