News August 2, 2024
ఉదయగిరి: బాత్రూంలో స్నానానికి వెళ్లిన వ్యక్తి మృతి
కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఉదయగిరి మండలంలో జరిగింది. గండిపాలెం గ్రామానికి చెందిన చిన్న వెంగయ్య (50) శుక్రవారం సాయంత్రం స్నానానికి బాత్రూంలోకి వెళ్లగా మరమ్మతులకు గురైన విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే పడిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. 108 కి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వైద్య సిబ్బంది చేరుకొని పడి ఉన్న వ్యక్తిని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారు.
Similar News
News September 15, 2024
బొల్లినేని కుటుంబ సభ్యులు రూ.కోటి విరాళం
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేటి వెంకట రామారావు తనయులు బొల్లినేని కార్తీక్ , బొల్లినేని ధనుశ్ ఆధ్వర్యంలో ప్రముఖ కాంట్రాక్టర్ గంటా రమణయ్య చేతుల మీదుగా అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం నారా చంద్రబాబు నాయుడుకి రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. వారిని ముఖ్యమంత్రి అభినందించారు.
News September 15, 2024
జాతీయ లోక్ అదాలత్‌లో మూడోసారి నెల్లూరుకు ప్రథమ స్థానం – జిల్లా జడ్జి
జిల్లావ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో 24,972 కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జి సి.యామిని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో నెల్లూరు జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించిందని లోక్ అదాలత్ కార్యక్రమాలపై నిరంతర దృష్టిపెట్టడంతో నెల్లూరు జిల్లా మూడో సారి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కించుకోవడంపై పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News September 15, 2024
జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే వరదలు: సోమిరెడ్డి
నెల్లూరు మాజీ మంత్రి సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలేరు ఆధునికీకరణకు 2019లో టీడీపీ టెండర్ పిలిస్తే, వైసీపీ విస్మరించిందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించేందుకు సైతం జగన్ ఆర్భాటాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ సీఎం జగన్‌కు క్యూసెక్, టీఎంసీ, అవుట్ ఫ్లో అంటే అర్థాలు కూడా తెలియవని ఎద్దేవా చేశారు.