News April 14, 2024
ఉదయాన్నే ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం మండల శివారులో బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 11, 2025
ఖమ్మం: ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్న ఓటర్లు

జిల్లా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. చక్రాల కుర్చీలో వృద్ధులు, చంటిబిడ్డలతో మహిళలు సైతం పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివస్తున్నారు. అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా, మొత్తంగా చాలా కేంద్రాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతోంది.
News December 11, 2025
వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ పై నిఘా: కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా మొదటి విడత 7 గ్రామపంచాయతీలో జరిగే పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్లో వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని సూచించారు.
News December 11, 2025
KMM: ‘అయ్యా బాబోయ్.. 10 రోజుల్లో రూ.125 కోట్ల మద్యం తాగేశారు’

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు మద్యం, నగదును ప్రధాన హస్తంగా మలుచుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో గడిచిన పది రోజుల్లో రూ.125 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. కాగా ఈ నెల 17 వరకు పంచాయతీ ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు మరింతగా పెరిగా అవకాశం ఉంది.


