News April 28, 2024

ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్న సీఎం: రఘునందన్

image

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ తిరిగి పుట్టినా రాజ్యాంగ సవరణ తప్ప మారదనే విషయాన్ని పీఎం మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అవిభక్త కవలలని ద్వజమెత్తారు.

Similar News

News April 14, 2026

మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ విడుదల

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

News April 14, 2026

మెదక్: హైవేపై మరమ్మత్తులను పరిశీలించిన కలెక్టర్

image

మెదక్ కలెక్టరేట్ ముందు జరుగుతున్న నేషనల్ హైవే 765-డీజీ రోడ్డు మరమ్మత్ పనులను కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News April 14, 2026

మెదక్: వడ దెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. తీవ్ర వడగాలులు వీస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వడదెబ్బ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని, యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆమె పేర్కొన్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు.