News September 9, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.
Similar News
News December 14, 2025
నిజామాబాద్‌లో రెండో విడత పోలింగ్ ప్రశాంతం

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ
ప్రశాంతంగా ముగిసింది. డిచ్‌పల్లి మండలంలో స్వల్ప ఘర్షణ జరిగినప్పటికీ పోలీసులు దాన్ని సమర్థవంతంగా నివారించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు శాంప్రసాద్ లాల్ ఎనిమిది మండలాల్లో తిరుగుతూ పోలింగ్ సరళిని పరిశీలించారు.
News December 14, 2025
నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News December 14, 2025
NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.


