News March 5, 2025
ఉపాధి కల్పన, వేతన లక్ష్యాలను చేరుకోవాల్సిందే: కలెక్టర్

జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా జిల్లాలోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో వేతనదారులకు పని కల్పించడంలోనూ,దినసరి వేతనం రూ.300 వచ్చేలా చూడటంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డ్వామా అధికారులతో కలిసి ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు.
Similar News
News December 7, 2025
ఇండిగో సంక్షోభం: గుత్తాధిపత్యమే ముంచిందా?

దేశంలో విమానయాన సంక్షోభానికి ఇండిగో గుత్తాధిపత్యమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండిగో(63%), ఎయిరిండియా(20%) తప్ప మిగతా సంస్థల వాటా నామమాత్రమే. కానీ 2014లో ఇండిగో(31.8%), జెట్ ఎయిర్‌వేస్(21.7%), ఎయిరిండియా(18.4%), స్పైస్ జెట్(17.4%), గో ఎయిర్(9.2%) ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు ఇండిగోలో సిబ్బంది కొరతతో పరిస్థితి తీవ్రమైంది. అదే మరిన్ని సంస్థలు ఉంటే ఇలా జరిగేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
News December 7, 2025
మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 7, 2025
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

నరసరావుపేటలో గత వారంతో పోలిస్తే ఈ ఆదివారం కేజీ చికెన్ ధర రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. లైవ్ కోడి కేజీ రూ. 135 ఉంది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ రూ. 240-280 ఉండగా స్కిన్‌తో రూ. 230-260 లభిస్తుంది. మటన్ కేజీ ధర రూ. 800-900 అందుబాటులో ఉంది. 100 కోడిగుడ్లు రూ. 670 అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


