News May 19, 2024
ఉప్పల్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ఉప్పల్ స్టేడియంలో ఆదివారం SRH- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్‌కు వచ్చే వాహనాలు HMDA భగాయత్ రోడ్డు వైపు దారి మళ్లిస్తామన్నారు.
Similar News
News December 14, 2024
చిలుకూరులో CM రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు
చేవెళ్ల నియోజకవర్గంలో CM రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం చిలుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, MLA కాలే యాదయ్య ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించారు. CM రాకతో మొయినాబాద్ మండల వ్యాప్తంగా, సభ వద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
News December 13, 2024
HYD: అగ్నివీర్ల ట్రైనింగ్‌పై ప్రశంసలు
సికింద్రాబాద్ EME కేంద్రాన్ని సీనియర్ కల్నల్ కమాండెంట్ సిదాన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ట్రైనింగ్, అడ్మినిస్ట్రేషన్‌లను పరిశీలించారు. అనంతరం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, బేసిక్ స్టాండర్డ్స్ మిలిటరీ ట్రైనింగ్, అగ్ని వీర్లకు అందిస్తున్న ట్రైనింగ్ విధానాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో వివిధ స్థాయి మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.
News December 13, 2024
HYD: Xలో అల్లు అర్జున్ బెయిల్ ట్రెండింగ్..!
HYDలో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ కాగా తాజాగా హైకోర్టు మధ్యంతర బెల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు పొందిన నటుడి అరెస్ట్, బెయిల్ ట్విట్టర్ Xలో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. HYDలో హీరో అల్లు అర్జున్ అరెస్టు అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం చూపింది.