News April 25, 2024
ఉప్పల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
విదేశాల్లో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఓ <<13106495>>యువకుడిని మృత్యువు<<>> వెంటాడింది. మేడిపల్లిలోని సత్యనారాయణపురానికి చెందిన మధుసూదన్ రెడ్డి, సుష్మ దంపతుల కుమారుడు వర్షిత్ రెడ్డి (23) బీటెక్ పూర్తి చేశాడు. మంగళవారం నారాయణగూడలోని ఓ బ్యాంకులో స్టేట్‌మెంట్ తీసుకునేందుకు బైకుపై బయలుదేరాడు. నల్లచెరువు ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. వెనక నుంచి వచ్చిన బస్సు మీది నుంచి వెళ్లగా మృతి చెందాడు.
Similar News
News January 22, 2025
HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర
HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.
News January 22, 2025
HYD: పద్మరావుతో ఫోన్‌లో మాట్లాడిన KTR
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. స్వల్ప అస్వస్థకు గురైన ఆయన ఆరోగ్య వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తాను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు పద్మారావు కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం.
News January 21, 2025
ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య
ఖైరతాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య సందడి చేశారు. మంగళవారం తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు ఆయన వివరాలు తీసుకొని, ప్రక్రియను పూర్తి చేశారు. హీరో రాకతో కార్యాలయం సందడిగా మారింది. పలువురు అధికారులు ఆయనతో ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.