News October 8, 2025

ఉప్పాడలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి

image

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ గురువారం ఉమ్మడి తూ.గో జిల్లాలోని ఉప్పాడ రానున్నారు. మత్స్యకారుల సమస్యలను స్వయంగా పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారని, కాలుష్యం జరుగుతుందని మత్స్యకారుల ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించేందుకు సముద్రంపై ప్రయాణిస్తారని జిల్లా సమాచార శాఖ తెలిపింది. ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పడడం, పవన్ పర్యటనతో తమ కష్టాలు తీరుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 22, 2026

కేస్లాపూర్‌లో నేడే ‘ప్రజా దర్బార్’

image

కేస్లాపూర్‌ నాగోబా జాతరలో అత్యంత కీలక ఘట్టమైన ‘ప్రజా దర్బార్‌’ నేడు నిర్వహించనున్నారు. 1940లో హైమన్‌డార్ఫ్‌ ప్రారంభించిన సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కలెక్టర్‌, ఐటీడీఏ అధికారులు హాజరై గిరిజనుల వినతులను స్వీకరించనున్నారు. అటవీ భూములు, విద్య, వైద్య సమస్యలపై గిరిజనులు తమ గోడు వెళ్లబోసుకోనున్నారు. దర్బార్‌ దృష్ట్యా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

News January 22, 2026

ఏలేశ్వరం – అడ్డతీగల దారిలో ఆర్టీసీ బస్సుల నిలుపుదల

image

ఏలేశ్వరం – అడ్డతీగల మధ్య రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నేడు ప్రజలు రోడ్డుపై నిరవధిక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో నేడు ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఏలేశ్వరం నుంచి అల్లూరి, పోలవరం, అనకాపల్లి జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి.

News January 22, 2026

మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ ‘అద్దె’ తోడ్పాటు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్దె బస్సుల పథకం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 21 మండల సమాఖ్యలు నిర్వహిస్తున్న బస్సులకు ఆర్టీసీ రూ.87.52 లక్షల అద్దె చెల్లించింది. ఒక్కో బస్సుకు నెలకు సగటున రూ.69,468 ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల నిధులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుస్తోంది.