News May 7, 2025
ఉప్పునుంతల మండలంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఉప్పునుంతల మండలంలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో దాదాపు 20 ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని సూచించారు.
Similar News
News February 17, 2026
ములుగు: బంపర్ ఆఫర్.. రెడీగా రూ.55 కోట్ల ఫండ్!

సాధారణంగా కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతాయి. కానీ, ములుగు మున్సిపల్ కార్యవర్గానికి సమస్యలతో పాటు నిధులు వెల్ కమ్ చెబుతున్నాయి. మంత్రి సీతక్క చొరవతో మేజర్ పంచాయతీ హోదాలో మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మొత్తం రూ.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ వార్డులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక సమస్యలున్నాయి. వీటిని తీర్చుతూనే ముందుగా కోతుల సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.
News February 17, 2026
హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

శివరాత్రి రోజున <<19153355>>పాక్‌తో జరిగిన<<>> మ్యాచ్‌లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్‌ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్‌తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.
News February 17, 2026
జగిత్యాల MLAపై ముప్పేటదాడి.. అయినా ధైర్యంగా ముందుకు..!

JGTL MLA సంజయ్‌పై వివిధ పార్టీల నేతలు రోజూ ముప్పేటదాడికి దిగారు. అయినా చలించకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లారు. పార్టీ మారావంటూ, ఎందులో ఉన్నావో చెప్పాలంటూ BRS ఎద్దేవ చేసినా, ఆ పార్టీ MLAలు మా సంసారంలో వేలెందుకు పెడతావన్నా, కాంగ్రెస్ నేతలు అవమానించినా వేరవలేదు. చివరకు కాంగ్రెస్ కౌన్సిలర్ల తరఫున MLA ప్రచారం చేసి తన వర్గాన్ని గెలిపించుకొని మున్సిపల్ ఛైర్మన్ చేసి ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇచ్చారు.


