News March 14, 2025

ఉమ్మడి ఆదిలాబాద్‌కు ఎల్లో అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌లో 40డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాలో వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News February 13, 2026

BREAKING: నర్సంపేట పీఠం కాంగ్రెస్‌దే

image

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మొత్తం 30 వార్డులకు గాను 20 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 16 కంటే అదనంగా మరో నాలుగు స్థానాలు దక్కాయి.

News February 13, 2026

ఏలూరు: హత్య కేసులో జీవిత ఖైదు

image

దెందులూరు మండలం గాలాయగూడెంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితుడు పాలడుగుల దుర్గాప్రసాద్‌కు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. 2022లో నమోదైన ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసినట్లు దెందులూరు ఎస్సై శివాజీ వెల్లడించారు.

News February 13, 2026

GWL: మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ హవా..!

image

గద్వాల జిల్లాలో అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల మున్సిపాలిటీలు ఉండగా మొత్తం 77 వార్డులు ఉన్నాయి. ఈనెల 11న ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. శుక్రవారం అధికారులు ఫలితాలు వెల్లడించారు. బీజేపీ 7 వార్డులు, కాంగ్రెస్ 29 వార్డులు, బీఆర్ఎస్ 30 వార్డులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 వార్డులు ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గెలుపొందారు. ఒక స్థానం ఆధిక్యంతో బీఆర్ఎస్ ముందు వరసలో నిలిచింది.