News December 3, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పట్టనున్న మహార్దశ

రూ.5,000 కోట్లతో NHలు, రూ.4,000 కోట్లతో రైల్వే లైనుతో ఉమ్మడి KNR జిల్లా ప్రయాణికులకు మహార్దశ పట్టనుంది. JGTL-KNR వరకు 58.60 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2484 కోట్లు, JGTL-MNCL వరకు 62.29 KMల మేర 4 లైన్ల విస్తరణకు రూ.2548 మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ఇక రామగుండం-మణుగూరు రైల్వే లైన్ కు రూ.4 వేల కోట్లు మంజూరయ్యాయి. మంథని-కాటారం-మేడారం-తాడ్వాయి-MNGR వరకు రైల్వేప్రయాణం సౌకర్యం ఏర్పడనుంది.
Similar News
News February 12, 2026
పోలవరం జిల్లాల్లో డీ వార్మింగ్ డేకు ఏర్పాట్లు

ఈనెల 17న డీ వార్మింగ్ డే సందర్భంగా జిల్లాలోని 29 ఆసుపత్రులు పరిధిలో 1-19 ఏళ్లలోపు 87,217 మందికి అన్ని PHCలకు మందులు పంపించామని జిల్లా వైద్యాధికారిణి డా.సరిత అన్నారు. 96 వేలు మాత్రలు వచ్చాయన్నారు. కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాలు గత నెల 31 నుంచి ఈనెల 13 తేదీ వరకు నిర్వహించినందులకు జిల్లాలో 800 మంది ఆశా వర్కర్స్‌కు ఒక్కొక్కరి రూ.1,050ల వంతున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.
News February 12, 2026
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: అనకాపల్లి ఎస్పీ

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. బుధవారం రాత్రి అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా జిల్లాలోని అన్ని శైవ క్షేత్రాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు.
News February 12, 2026
NLR: దొంగతనం నింద వేశారని విద్యార్థి సూసైడ్

నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది. టీపీగూడూరు(M) మండలం పేడూరు గమ్మళ్లపాలేనికి చెందిన యువకుడు(16) ఓ ప్రైవేట్ స్కూళ్లో 10వ తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. అతను చదివే స్కూల్లో నగదు దొంగతనం జరిగిందని.. విద్యార్థే చోరీ చేశాడని టీచర్లు నిలదీశారంట. నింద భరించలేకే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థి బంధువులు ఆరోపిస్తున్నారు.


