News April 1, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ మెట్ పల్లి మండలం రాజేశ్వరరావు పేట బ్రిడ్జి వద్ద టిప్పర్ కింద పడి యువతి దుర్మరణం. @ ఇబ్రహీంపట్నం మండలంలో దేవాలయాలలో చోరీ. @ హుస్నాబాద్ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. @ జగిత్యాల కలెక్టరేట్లో చలివేంద్రమును ప్రారంభించిన కలెక్టర్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ. @ ఇంటి పన్ను వసూళ్లలో జగిత్యాల జిల్లా స్టేట్ లో టాప్.
Similar News
News February 7, 2026
KNR: అభివృద్ధిని అడగని ఓటర్లు..!

ఉమ్మడి KNRజిల్లా మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ వేరు. ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి. వాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలపై అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించడం మానేశారు. “ఎవరు ఎంత ఇస్తున్నారు? ఏ పార్టీ మందు పోస్తోంది?” అనే చర్చపైనే ప్రధాన దృష్టి సారించారు. అభ్యర్థులు కూడ కేవలం ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
News February 7, 2026
KNR:అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులు: కలెక్టర్

సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28కి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
News February 7, 2026
రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.


