News February 17, 2025
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదాపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.
Similar News
News March 18, 2025
బయ్యారం: పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య

కాకతీయ నగర్ కాలనీలో సోమవారం అజ్మీర(సాయి) మహేశ్(18) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. మృతుడు సిద్దిపేట జిల్లాలోని ఓ కళాశాలలో ఫిజియో థెరఫీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హోలీ పండుగ సందర్భంగా సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
News March 18, 2025
కరీంనగర్: ఉద్యోగుల సేవలు అభినందనీయం: కలెక్టర్

తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డీ కాలనీలోని సూపరింటెండెంట్ ఇంజనీర్, నీటిపారుదల సర్కిల్ కార్యాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడంలో అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
News March 18, 2025
జగిత్యాల: కనుమరుగవుతున్న ఎడ్ల బండ్లు!

నాగరికత అంటే ముందుగా గుర్తొచ్చేది ఎడ్ల బండి. పూర్వం రైతులు ప్రతి అవసరానికి ఎడ్ల బండిని వాడేవారు. ప్రస్తుత రోజుల్లో ఎడ్ల బండి కనుమరుగై మ్యూజియంలో బొమ్మగా మారింది. జగిత్యాల జిల్లాలో ట్రాక్టర్ బండ్లు వచ్చినప్పటి నుండి ఎడ్ల పనులను ఉపయోగించడం తగ్గింది. రైతులు ఎడ్లను తమ కుటుంబ సభ్యులుగా చూసుకోవడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది.