News April 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్లాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం. @ రాయికల్ మండలంలో అనారోగ్యంతో స్వర్ణకారుడి ఆత్మహత్య. @ కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 22 నుండి 24 వరకు అర్జిత సేవలు రద్దు. @ మెట్పల్లి మండలంలో పిడుగు పడి ఒకరికి తీవ్ర గాయాలు. @ మల్లాపూర్ మండలంలోని చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ. @ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ కోరుట్లలో వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర.

Similar News

News December 12, 2025

KNR: చలి మంట కాగుతూ సిబ్బందితో సేదతీరిన సీపీ గౌష్ ఆలం

image

కరీంనగర్ మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమైన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం చలి తీవ్రత దృష్ట్యా కొద్దిసేపు సేదతీరారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తూ, చలి మంట కాగుతూ ఆయన సిబ్బందితో కొద్ది నిమిషాలు విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.

News December 11, 2025

ఫకీర్ పేట్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా విజయలక్ష్మి

image

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

News December 11, 2025

కరీంనగర్ జిల్లాలో 81.42% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.42% పోలింగ్ కాగా, అత్యధికంగా చొప్పదండిలో 83.66% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ రూరల్లో 84.67%, రామడుగులో 82.05%, గంగాధరలో 78.70%, కొత్తపల్లిలో 79.19% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి.