News April 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మంథని మండలంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు. @ మల్హర్ మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. @ బోయిన్పల్లి మండలంలో ఈతకు వెళ్లి బాలుడు మృతి. @ బిఆర్ఎస్ శవ రాజకీయాలు చేస్తుందన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్ RESULTS.. కరీంనగర్‌కు 7వ ర్యాంకు

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14943 మంది పరీక్షలు రాయగా 11961 మంది పాసై 80.04 శాతంతో స్టేట్‌లోనే 7వ ర్యాంకు వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1320 మందికి 876 మంది పాసై 66.36 శాతంతో 30వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 1837 మందికి 591 మంది పాసై 32.17%తో 16వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 163 మందికి 71 మంది పాసై 43.56%తో 28th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. కరీంనగర్‌కు 6వ ర్యాంకు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 16726 మంది పరీక్ష రాయగా 11737 మంది పాసై 70.17 శాతంతో స్టేట్‌లోనే 6వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1,449 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 822 మంది విద్యార్థులు పాసై 56.73 శాతంతో స్టేట్‌లో 24వ స్థానంలో నిలిచింది.

News April 12, 2026

KNR: మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహేష్

image

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన మేడి మహేష్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తనపై నమ్మకంతో నియమించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని మహేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుల వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.