News April 27, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ కమాన్పూర్ మండలంలో షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్ధం. @ వేములవాడ రాజన్నను దర్శించుకున్న పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి. @ కరీంనగర్ పార్లమెంటు లో 20 మంది నామినేషన్ల తిరస్కరణ. @ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల నిషేధం: పోలీస్ కమిషనర్. @ మే 1న కోరుట్ల బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. @ కోరుట్లలో సీఎం సభ స్థలాన్ని పరిశీలించిన జగిత్యాల ఎస్పీ.
Similar News
News April 19, 2026
జమ్మికుంట: జిల్లా పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా కందికట్ల పద్మ

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత ఐక్య వేదిక కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా విభాగ నూతన అధ్యక్షురాలిగా జమ్మికుంటకు చెందిన కందికట్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

News April 18, 2026
KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.