News March 10, 2025

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలువురికి నిరాశే.!

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కూటమి నేతలకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఆశించిన నేతల ఎదురుచూపులు ఫలించలేదు. పదవి తప్ప కుండా వస్తుందని ఆశించిన నాయకులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా టీడీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఆశించారు. ఉమ్మడి జిల్లాలో ఒక రెండు ఎమ్మెల్సీలు లభిస్తాయని అంతా ఊహించినా లెక్కతప్పింది. అధిష్ఠానం ఒక్కటీ కేటాయించలేదు. దీంతో నిరాశ చెందారు.

Similar News

News January 19, 2026

RR: 5 విడతల్లో సర్పంచ్‌లకు శిక్షణ

image

ఈ నెల19 నుంచి 23 వరకు నూతన సర్పంచ్‌లకు మొదటి విడతలో శిక్షణను ఇవ్వనున్నారు. మొదటి విడతలో చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని గ్రామ పంచాయతీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 2వ విడతలో మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, 3వ విడతలో కందుకూరు, నందిగామ, మహేశ్వరం, కేశంపేట, 4వ విడతలో ఫరూఖ్‌నగర్, కొత్తూరు, కొందుర్గు, చౌదరిగూడ, 5వ విడతలో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, శంషాబాద్ సర్పంచ్‌లకు ఇవ్వనున్నారు.

News January 19, 2026

రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

image

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.

News January 19, 2026

ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

image

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.