News August 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేలంపాట
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} వైరాలో ఎంపీ RRR పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

Similar News

News February 15, 2025

ఖమ్మం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి: కవిత

image

ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు, కానీ అభివృద్ధిలో శూన్యమని, వారు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడుతూ.. బనకచర్ల పర్మిషన్ ఇస్తే ప్రజలు చాలా నష్టపోతారన్నారు. కళ్ల ముందు నీళ్లు వెళ్తున్నా.. ఉపయోగించుకోలేక పోతున్నామని చెప్పారు. మంత్రి తుమ్మల చాలా సీనియర్, ఆనాడు ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో ఆయనకు తెలుసని పేర్కొన్నారు.

News February 15, 2025

ఖమ్మం: స్టేడియంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్

image

ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి స్టేడియంను సందర్శించారు. స్విమ్మింగ్ పూల్, షటిల్ బ్యాట్ స్కేటింగ్, వ్యాయామ కేందం, జిమ్నాస్టిక్ హాల్, వాలీబాల్ కోర్టును పరిశీలించారు. క్రీడాకారులకు పౌష్టికాహారం, ఫ్రూట్స్, స్పోర్ట్ షూ అవసరమైన క్రీడా సామగ్రిని అందించాలని కోరారు.

News February 15, 2025

KMM: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!