News August 13, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
>అశ్వరావుపేట నియోజకవర్గం లో ఎమ్మెల్యే జారే పర్యటన
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
>సీఎం సభ ఏర్పాట్లపై వైరా ఎమ్మెల్యే సమీక్ష సమావేశం
>పాల్వంచ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
Similar News
News September 11, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
> వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన > భద్రాచలం వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి > కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం > సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన > మధిర మండలంలో మంచినీటి సరఫరా బంద్ > పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు >ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన >మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
News September 11, 2024
నిలకడగా భద్రాచలం గోదావరి నది ప్రవాహం
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గడిచిన గంట నుంచి నిలకడగా కొనసాగుతోంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం లేదని, ఒకవేళ పెరిగినా స్వల్పంగా పెరిగి, అనంతరం తగ్గుముఖం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
News September 11, 2024
ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!
ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ కళాశాల మోడల్ కెరీర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. స్పందన స్పీహూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ నందు ఖాళీగా ఉన్న 100 పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-29 ఏళ్ళు కలిగి, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు అన్నారు. ఉ.10 గంటలకు జరిగే జాబ్ మేళాలో విద్యార్హత పత్రాలతో హాజరు కావాలన్నారు.