News April 1, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా లో TODAY HEADLINES

∆} వివిధ శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాద్రి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం రద్దు
∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
Similar News
News February 7, 2026
మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
News February 7, 2026
ఖమ్మం: జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఫిబ్రవరి 28తో ముగియనుందని, అర్హులు I&PRవెబ్‌సైట్ ద్వారా ఈ నెల 9 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మీడియా యాజమాన్యాలు తమ ప్రతినిధుల జాబితాను డీపీఆర్వో కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
News February 6, 2026
ఖమ్మం: ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ‘రాయ’బారమేదీ?

ఏదులాపురం పుర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు గైర్హాజరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పాలేరులో పార్టీకి వెన్నెముకలా ఉన్న ఆయన, వందలాది గ్రానైట్ పరిశ్రమలున్న ఈ మున్సిపాలిటీలో అంటీముట్టనట్లు ఉండటం వెనుక మంత్రి పొంగులేటి శిబిరం నుంచి పిలుపు అందకపోవడమే ప్రధాన కారణమని శ్రేణులు చర్చించుకుంటున్నారు.


