News April 1, 2024
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 113 ఏళ్లు

1911, ఏప్రిల్ 1వ తేదీన ఏర్పడిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు నేటితో 113 ఏళ్లు పూర్తి అయింది. ఏపీలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో కాణిపాకం, తిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. జిల్లాలు విడిపోవడంతో అప్పటి నుంచి ఇప్పటివరకు చిత్తూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. ఇద్దరు మాజీ సీఎంలు, ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్న పట్టించుకోలేదు.
Similar News
News February 10, 2026
చిత్తూరు జిల్లాలో కష్టంగా పశుపోషణ…!

చిత్తూరు జిల్లాలో చలికాలం కావడంతో పశుపోషణ రైతులకు తీవ్ర భారంగా మారింది. చలి కారణంగా పచ్చి గడ్డి త్వరగా పెరగడం లేదు. పశువుల మేతకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఎండు గడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గడ్డి మోపు ధర ఒక్కటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో రైతులు పశువులను పోషించడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల రేట్లు తక్కువగా ఉండటంతో పశుపోషణ కష్టంగా మారింది.
News February 10, 2026
మార్చి 15 లోపు పనులు పూర్తి: చిత్తూరు కలెక్టర్

కేంద్ర ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందిన నిధులను మార్చి 15లోగా వినియోగిస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి జీఎస్టీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర-2047విజన్ లక్ష్యంలో భాగంగా 10సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈసమావేశంలో కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంతో ఎస్పీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
News February 10, 2026
చిత్తూరు: పథకాలు సాధించడం అభినందనీయం

నెల్లూరు జిల్లాలో గత నెల నిర్వహించిన పారా స్పోర్ట్స్ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్ అథ్లెటిక్స్ విభాగంలో జిల్లా దివ్యాంగ క్రీడాకారులు పతకాలు సాధించడం అభినందనీయమని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ అభినందించారు. జిల్లా తరఫున మొత్తం 16 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొని 23 పతకాలు సాధించడం గర్వకారణమని తెలిపారు.


