News April 22, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

✔మద్దూర్: నేటి నుంచి బాలాజీ ఉత్సవాలు ప్రారంభం
✔నేటి నుంచి సలేశ్వరం ఉత్సవాలు ప్రారంభం
✔పాలీసెట్ దరఖాస్తులకు నేడే తుది గడువు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు
✔GDWL,అమరచింత: నేడు పలు గ్రామాలలో కరెంట్ కట్
✔సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు
✔ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు
✔పలుచోట్ల కేంద్ర బలగాలతో కవాతు
✔NGKL,మద్దూర్:రేపు రేవంత్ రెడ్డి రాకతో ఏర్పాట్లపై ఫోకస్
Similar News
News December 17, 2025
మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
News December 17, 2025
MBNR: నేడు 122 సర్పంచ్‌లు, 914 వార్డులకు ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల నేపథ్యంలో మొత్తం 133 జీపీలు,1152 వార్డ్ సభ్యులకు గాను 10 సర్పంచ్ లు,231 వార్డ్‌లు ఏకగ్రీవం. జడ్చర్ల(M)లో ఒక జీరో నామినేషన్, 7 వార్డ్ సభ్యులకు జీరో నామినేషన్ పోను 122 సర్పంచ్‌లు, 914 వార్డ్ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు ఏకగ్రీవంతో కలిపి 440 మంది అభ్యర్థులు, వార్డ్ సభ్యులు 2,584 మంది పోటీలో ఉన్నారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
News December 17, 2025
MBNR:‘ఇన్నోవేషన్ పంచాయత్’.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా!

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(టీజీఐసీ ) తెలంగాణలోని ఆవిష్కర్తలను, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.https://forms.gle/Av75xS4UUGRNKLpx8 ఫార్మ్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT.


