News August 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

> MLG: జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క > HNK: కొత్తకొండ ఆలయాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ > WGL: భారీ ధర పలుకుతున్న మక్కలు> MHBD: జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు > HNK: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం > JN: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, రాజేశ్వర్ రెడ్డి > BHPL: జిల్లా వ్యాప్తంగా 2వ రోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం

Similar News

News September 13, 2024

ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు

image

వరంగల్లోని ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. ఈనెల 14న శనివారం వారాంతపు యార్డు బందు, 15న ఆదివారం కాగా, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబీకి సెలవు ఉందన్నారు. తిరిగి 18న మార్కెట్ పున:ప్రారంభం అవుతుందన్నారు.

News September 13, 2024

ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించండి: కలెక్టర్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం వరంగల్, కరీంనగర్, సిద్దిపేట ప్రధాన రహదారిలో ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతోపాటు సుందరీకరణ చేపట్టడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కలెక్టర్ పి.ప్రావీణ్య పరిశీలించారు. ఎల్కతుర్తి జంక్షన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ KUDA అధికారులను ఆదేశించారు.

News September 12, 2024

BREAKING.. BHPL: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి

image

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన రవీందర్(35) రేగొండ నుంచి కొత్తపల్లికి బైకుపై వెళ్తుండగా భూపాలపల్లి నుంచి వస్తున్న RTC బస్సు ఢీకొట్టింది. దీంతో రవీందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.