News March 13, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా.. అత్యధికంగా గద్వాల జిల్లా మల్దకల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో 39.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా దగడలో 39.6 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 39.3 డిగ్రీలు, జిల్లా జక్లేరులో 39.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 18, 2026

NLG: రేపటి వరకు రేషన్ బియ్యం పంపిణీ

image

రేషన్ బియ్యం ఈ నెల 19వ తేదీ వరకు సరఫరా చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాసన రఘునందన్ తెలిపారు. ఇప్పటివరకు రేషన్ తీసుకోని లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైనా కారణాలతో రేషన్ తీసుకోని వారికి అవకాశం ఉందని తెలిపారు.

News February 18, 2026

FSLలో కొలువులు.. NOTIFICATION వచ్చేసింది..!

image

TG ఫోరెన్సిక్ ల్యాబ్(FSL) ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు గమనిక. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసుకున్న వారిలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాతపరీక్షలకు ఎంపిక చేశారు. MAR 5,6,7 తేదీల్లో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పరీక్షలు జరగనున్నాయి. షార్ట్ లిస్ట్ కానివారు రూ.500 ఫీజు చెల్లించి FEB 21వ తేదీ ఉదయం 8గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలు తెలపవచ్చు. హాల్ టికెట్ల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.

News February 18, 2026

ఆత్మ గౌరవం కోసం మార్గదర్శకాలు

image

– నీ మాటలకు విలువ లేని చోట మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
– నిన్ను గౌరవించని ప్రదేశంలో ఒక్క క్షణం కూడా నిలబడకూడదు.
– ప్రేమ లేని చోట దాని కోసం ఆశ పడటం వ్యర్థం.
– నీకు నచ్చని, నువ్వు తప్పు చేయని విషయాలకు అనవసరంగా క్షమాపణలు చెప్పకు.
– నీకు నచ్చని పనుల గురించి ఇతరులకు వివరణలు ఇస్తూ కూర్చోకు.