News December 13, 2025

ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి.. జాగ్రత్తగా ఉండండి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలిలా.. సంగారెడ్డి జిల్లా కోహిర్ 6.1, మల్చెల్మ 7.0, మెదక్ జిల్లా దామరంచ 8.2, వెల్దుర్తి 9.0, సిద్దిపేట జిల్లా తిప్పారం 8.3, పోతారెడ్డి పేట 8.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలోనమోదయ్యాయి. చలి తీవ్ర దృష్ట్యా గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు, ఆస్తమా రోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News January 19, 2026

మెదక్: పింఛన్ డబ్బుల కోసం తల్లిని చంపిన కొడుకు

image

మెదక్ మండలం రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు తన పింఛన్ డబ్బులు, బంగారం ఇవ్వలేదన్న కోపంతో చాకలి రాములు తన కన్నతల్లి నరసమ్మను కట్టెతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్సై లింగం సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

News January 19, 2026

మెదక్: 267 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం

image

జిల్లాలోని 267 పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద 388 టాయిలెట్లు మంజూరైనట్లు డీఈఓ విజయ తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ. 2 లక్షలు కేటాయించామన్నారు. బాలురు, బాలికలకు ప్రత్యేకంగా నిర్మించే ఈ పనులను సర్పంచులతో సమన్వయం చేసుకుని వెంటనే ప్రారంభించాలని హెచ్‌ఎంలు, ఎంఈఓలను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News January 19, 2026

‘మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి’

image

మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. మెదక్ జిల్లాని రాజన్న సిరిసిల్ల జోన్‌లో గత ప్రభుత్వం అనాలోచితంగా కలిపిందని పలువురు ఆరోపించారు. నిరుద్యోగులు గ్రేడ్-4 స్థాయి ఉద్యోగాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్‌లో కలిపి ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు.