News November 19, 2025

ఉమ్మడి జిల్లా క్రీడలు.. సొమ్మసిల్లిన విద్యార్థులు

image

ఏటూరునాగారంలో జరుగుతున్న జోనల్ లెవెల్ క్రీడల్లో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు కనీస ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్నం ఎండకు సొమ్మసిల్లి పడిపోయారు. గంటల తరబడి ఎండలో నిలబెట్టడంతో కిందపడిన విద్యార్థులను తోటివారు అందుబాటులోని వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పలు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో క్రీడా, ఐటీడీఏ శాఖ విఫలమైందని తల్లిదండ్రులు వాపోయారు.

Similar News

News January 22, 2026

కడప: ‘పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో డీఎంఎఫ్ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్) ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి రెండవ వారంలోగా పనులను పూర్తి చేయాలని కోరారు.

News January 22, 2026

పాలమూరు: ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్‌గా అంజయ్య

image

ఆర్టీసీ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్‌గా కల్వకుర్తి డిపోకు చెందిన అంజయ్య ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ రీజియన్ నుంచి బద్రియ, రాముడు, రామప్ప కూడా ఈ గుర్తింపు పొందారు. మొత్తం 10 డిపోల పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన 30 మంది డ్రైవర్లను ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు అందజేసినట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు.