News December 1, 2025

ఉమ్మడి నల్గొండలో పార్టీ బలోపేతంపై BJP ఫోకస్..!

image

తెలంగాణలో బీజేపీ బలోపేతం లక్ష్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జిల్లాల ఇన్‌ఛార్జ్‌లను కొత్తగా నియమించారు. జిల్లాల వారీగా నాయకత్వ మార్పులు చేసి, గ్రౌండ్‌లో కార్యకర్తలతో అనుసంధానం, పంచాయతీ ఎన్నికల వేళ దూకుడు పెంచాలని పార్టీ భావిస్తోంది. నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉదయ్‌ను నియమించగా, సూర్యాపేటకు టీ.రమేశ్, యాదాద్రి భువనగిరికి శ్రీనివాసరెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

Similar News

News February 18, 2026

మరోసారి అభిషేక్ డకౌట్

image

T20WC: భారత డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశ పరిచారు. పసికూన నెదర్లాండ్స్‌పై పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగారు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఆర్యన్ దత్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కాగా అభిషేక్ ఈ ప్రపంచకప్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ డకౌట్ కావడం గమనార్హం.

News February 18, 2026

విశాఖ సాగర్ తీరంలో జెట్ ఫైటర్ల విన్యాసాలు (వీడియో)

image

అంతర్జాతీయ ప్లేట్ రివ్యూలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు విశాఖ సముద్రతీరంలో అద్భుత విన్యాసం చేశాయి. ఒకేసారి ఏడు జెట్ ఫైటర్లు సముద్రానికి దగ్గరగా వెళ్తూ పల్టీలు కొట్టడం, బాంబులు వదిలే విన్యాసాలు నిర్వహించారు. తీరానికి శత్రుదేశం నౌకలు ఏమైనా చేరుకుంటే వాటిని ఎలా పేల్చాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.

News February 18, 2026

నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.