News May 2, 2024
ఉమ్మడి నల్గొండలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండగా.. ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నాంపల్లి, మునగాలలో 46.4 డిగ్రీలు, తెల్దేవరపల్లి, కేతేపల్లి, మాడులపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు.
Similar News
News December 16, 2025
పేరుకే కొలువు.. వేతనాలు అందక 9 నెలలు!

నెలల తరబడి వేతనాలందక జిల్లాలోని ‘104’ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ పోషణకు కొందరు అప్పులు చేస్తున్నారు. ఇంకొందరి పరిస్థితి దయనీయంగా మారింది. 9 నెలలుగా వేతనాలు సక్రమంగా అందకపోవడంతో అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 100కు పైగానే 104 సిబ్బంది పని చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
News December 16, 2025
NLG: 38 మందిపై కేసు.. ఆ గ్రామంలో పోలీస్ పికెట్

నిడమనూరు(M) సోమోరిగూడెంలో జరిగిన ఉద్రిక్తతకు కారకులైన 38మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సతీష్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆదివారం రాత్రి BRS నాయకులు, పోలింగ్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు సోమోరిగూడెం వచ్చి ఘర్షణకు పాల్పడిన వారిని చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో BRS వర్గీయులు ఎన్నికల సామాగ్రి పోస్టర్లు చించివేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
News December 16, 2025
వైష్ణవ ఆలయాల్లో నేటి నుంచి ధనుర్మాసం

జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు ధనుర్మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. నేటి నుంచి జనవరి 14 వరకు వేంకటేశ్వరస్వామి, శ్రీరామ మందిరాల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మాసంలో రోజూ తెల్లవారుజామున తులసి మాల కైంకర్యం, గోదాదేవి రచించిన పాశురాల పఠనం నిర్వహిస్తారు. సాయంత్రం వేళల్లో పుష్పాలంకరణలు, పల్లకీ సేవలు నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.


