News December 1, 2025

ఉమ్మడి నల్గొండ జిల్లాకు కొత్తగా 4,917 రేషన్ కార్డులు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నవంబర్‌లో ప్రభుత్వం 4,917 కార్డులను కొత్తగా జారీ చేసింది. దీంతో గత నెల 11,47,560 కార్డులు ఉండగా తాజాగా వాటి సంఖ్య 11,52,477కు చేరింది. యూనిట్ల సంఖ్య గత నెల వరకూ 34,66,221 ఉండగా తాజాగా 14,376 పెరగడంతో 34,80,597కు చేరింది. బియ్యం కోటా గత నెలలో 22,007 టన్నులు ఉండగా 92 టన్నులు పెరిగి 22,099 టన్నులకు చేరింది.

Similar News

News February 11, 2026

వరుస హత్యలతో సీతంపేటలో ఆందోళన!

image

MHBD(D) గార్ల మండలం సీతంపేట పరిధిలో గత రెండేళ్లుగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మహేష్‌ అనే యువకుడి హత్య, అంకన్నగూడెంలో కన్నబిడ్డలకే విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, అత్తను అల్లుడే కరెంట్ షాక్‌తో చంపడం వంటి ఘటనలు కలకలం రేపాయి. మానవతా విలువలు మంటగలుస్తున్నాయని, ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులు, సామాజిక సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.

News February 11, 2026

గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

image

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.

News February 11, 2026

తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

image

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.