News March 24, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. సాగు నీరు లేక ఇప్పటికే లక్ష ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయాయి. నేలలు నెర్ర బారగా.. వరి పంట పశుగ్రాసంగా మారింది. సాగర్ లో నీటి లభ్యత లేకపోవడంతో ఆయకట్టు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పడిపోవడంతో బోరుబావులు అడగంటాయి. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
Similar News
News April 13, 2026
NLG: ఒకే సీజన్‌లో రెండోసారి వాత

కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ యాసంగి సీజన్‌లోనే రెండోసారి ధరలు పెరగగా, తాజాగా బస్తాకు 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడింది. ఒక్క డీఏపీ, యూరియా మినహా పొటాష్ సహా మిగతా అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులపై సుమారు 109.50 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.
News April 13, 2026
నల్గొండ జిల్లాలో అమ్మాయిలదే హవా

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో NLG గత ఏడాది ఉన్న 68.84% ఉత్తీర్ణతను అధిగమించి, ఈసారి 73.69%తో అద్భుత ప్రగతిని కనబరిచింది. దీనివల్ల రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌లో గతేడాది 22వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 12వ స్థానానికి ఎగబాకి తన సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణత శాతం 57.99 శాతం నుంచి 62.81%కి పెరగడంతో పాటు ర్యాంకు మెరుగుపడటం విశేషం. జిల్లాలో రెండేళ్లుగా అమ్మాయిలదే హవా నడుస్తోంది.
News April 13, 2026
నల్గొండ: రీఛార్జ్‌తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.


