News September 10, 2025
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిండిన చెరువులు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,086, నాగర్‌కర్నూల్‌లో 1,222, వనపర్తిలో 1,096, నారాయణపేటలో 650, జోగులాంబ గద్వాలలో 375 చెరువులు దాదాపు 90 శాతం వరకు నిండిపోయాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మీ దగ్గర చెరువులు నిండాయా..? COMMENT
Similar News
News December 13, 2025
VJA: ఫొటోలకు పోజులే.. రూపాయి ఉపయోగం లేదు!

మొంథా తుఫాను వల్ల కృష్ణా జిల్లాలో వరి పంట 54 వేల ఎకరాలు, ఇతర పంటలు 2వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. రూ.75.21 కోట్ల నష్టం వాటిల్లింది. NTR జిల్లాలో వరి 5వేలు, పత్తి 4వేల ఎకరాల్లో దెబ్బతినగా రూ.12.19 కోట్ల నష్టమొచ్చింది. అయితే ఇంతవరకు రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దెబ్బతిన్న పంటలను పరిశీలించినా కేవలం ఫోటోల కోసమే నేతలు పర్యటనలు చేశారా అన్నట్లుగా ఉంది.
News December 13, 2025
వికారాబాద్: మొదటి విడతలో కాంగ్రెస్ అభ్యర్థులే అధికం

వికారాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొదటి విడతలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధికంగా గెలిచారు. అందులో కాంగ్రెస్ 175 మంది, బీఆర్ఎస్ నుంచి 74 మంది, ఇతరులు పదిమంది, బీజేపీ ముగ్గురు గెలుపొందారు. జిల్లాలో బీజేపీ ప్రభావం ఎక్కడ కూడా కనబడలేదు. అధికారంలోకి వస్తామని నాయకులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు కనబడటం లేదని తెలుస్తోంది.
News December 13, 2025
విశాఖలో అల్లూరి జిల్లా యువకుడి అనుమానాస్పద మృతి

కూర్మన్నపాలెం నిన్న అల్లూరి(D) జీకేవీధికి చెందిన విజయ్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. కార్ల వాషింగ్ సెంటర్‌లో పనిచేస్తున్న అతను తన ప్రియురాలిని ఇక్కడికి రమ్మనగా..ఆమె మరో ఇద్దరు మహిళలతో వచ్చింది. వారంతా విజయ్‌కు యజమాని ఇచ్చిన రూమ్‌లో ఉన్నారు. అయితే తర్వాత యజమాని ఖాళీ చేయమనడంతో మహిళలు వెళ్లిపోయారు. ఆ సాయంత్రం రూమ్‌లో విజయ్ మృతి చెంది ఉన్నాడు. ఆ మహిళల ఫోన్లు కలవడం లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


