News August 12, 2025

ఉమ్మడి మెదక్‌లో 7,65,355 మాత్రల పంపిణీ

image

ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 7,65,355 ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3,77,572, సిద్దిపేట జిల్లాలో 2,09,370, మెదక్ జిల్లాలో 1,78,413 మాత్రలు పంపిణీ చేశామన్నారు. 1-19 ఏళ్ల పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కోరారు. నేడు తీసుకొని పిల్లలు తప్పనిసరిగా మాత్ర తీసుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

Similar News

News March 14, 2026

మెదక్: తీవ్ర విషాదం.. కార్మికుడి మృతి!

image

శివంపేట్ మండలంలోని గోమారంలో విషాదం నెలకొంది. వీధి లైట్ల మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పంచాయతీ కార్మికుడు నీరుడి రాములు (48) విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడిపోయారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News March 14, 2026

అరకులో హీరో సుమన్ సందడి

image

అనంతగిరి మండలంలో ఎన్ఆర్ పురంలో వైకుంఠగిరి వేంకటేశ్వర స్వామిని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, సినీ హీరో సుమన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే, సుమన్‌ను ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి ప్రతిమను వారికి ఇచ్చారు. ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఇరువురు ఆకాంక్షించారు. వైసీపీ నాయకులున్నారు.

News March 14, 2026

ఆర్మూర్‌లో ఘోర యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

image

ఆర్మూర్ పట్టణంలోని పెట్రోల్ బంక్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మూర్‌ పిప్రి గ్రామానికి చెందిన ఒకరు, భీమ్‌గల్‌కు చెందిన మరో వ్యక్తితో స్కూటీపై వెళ్తుండగా అతివేగంతో వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక బార్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.