News November 19, 2025
ఉమ్మడి మెదక్ జిల్లా వెదర్ రిపోర్ట్..!

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ 9.5, కోహిర్ 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 10.1, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 9.6, కొండపాకలో 10.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News January 19, 2026
యాదాద్రి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి పర్యటన

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:30కు యాదగిరిగుట్ట స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం సైదాపురంలో అంగన్‌వాడీ భవనాలు, సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేస్తారు. యాదగిరిగుట్ట, ఆలేరులో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్నం 1:30కు మాటూరులో సబ్ స్టేషన్ పనులను ప్రారంభిస్తారు.
News January 19, 2026
ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొంటున్నారు. ‘స్వనితి’ ఆధ్వర్యంలో నిర్వహించిన “ది మెరిడియన్ కలెక్టివ్” కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలన, సుస్థిర లక్ష్యాలపై ఈ సదస్సులో ఆయన చర్చించనున్నారు. అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రగతిని చాటిచెప్పేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ఎంపీ కార్యాలయం తెలిపింది.
News January 19, 2026
మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.


