News April 22, 2024

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నేడు నామినేషన్లు వేసేది వీరే

image

➤ బెల్లాన చంద్రశేఖర్(వైసీపీ): విజయనగరం ఎంపీ
➤ బేబినాయన(టీడీపీ): బొబ్బిలి ఎమ్మెల్యే
➤ కొత్తపల్లి గీత(బీజేపీ): అరకు ఎంపీ
➤ తోయక జగదీశ్వరి(టీడీపీ): కురుపాం ఎమ్మెల్యే
➤ కూర్మి నాయుడు(కాంగ్రెస్): గజపతినగరం ఎమ్మెల్యే
➤ గీతారాణి(భారత్ ఆదివాసీ పార్టీ): కురుపాం ఎమ్మెల్యే
➤➤ వీరితో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఈరోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Similar News

News December 6, 2025

VZM: వెనుకబడ్డ మండలాలపై కలెక్టర్ అసహనం

image

100 రోజుల పనిదినాల కల్పనలో వెనుకబడిన మండలాలపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కల్పనపై శుక్రవారం వీసీ నిర్వహించారు. వంగర, మెంటాడ, జామి, వేపాడ, కొత్తవలస, తదితర మండలాలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రగతి చూపని మండలాల్లో పనులను వెంటనే వేగవంతం చేయాలని, వేతనం రూ.300కి తగ్గకుండా పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీఓ, ఏపీఓలకు సూచించారు.

News December 5, 2025

1,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు: కలెక్టర్

image

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయల సాగును పెంచాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం ఉద్యాన శాఖపై సమీక్షించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం 1,000 ఎకరాల్లో ఉద్యాన పంటల అభివృద్ధి జరగాలని, నీటి సదుపాయం లేని చోట రుణాల ద్వారా బోర్వెల్స్ ఏర్పాటు చేసి సాగు పెంచాలని ఆదేశించారు.

News December 5, 2025

VZM: కోర్టు కాంప్లెక్సుల్లో వాష్‌రూమ్‌ల నిర్వహణకు టెండర్లు

image

జిల్లాలోని వివిధ కోర్టు కాంప్లెక్సుల్లో 178 వాష్‌ రూమ్‌ల వార్షిక శుభ్రత నిర్వహణకు సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత శుక్రవారం తెలిపారు. 18 మంది క్లీనింగ్ సిబ్బందితో ఈ కాంట్రాక్ట్ ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆసక్తి గల అర్హులైన వారు తమ కొటేషన్లను ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, విజయనగరానికి సమర్పించాలని కోరారు.