News May 13, 2024
ఉమ్మడి విజయనగరం జిల్లాలో మాక్ పోలింగ్

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కురుపాం, సాలూరు, పాలకొండలో గంట మందే పోలింగ్ ముగియనుంది.
Similar News
News December 10, 2025
VZM: దుకాణాల్లో పండగ ఆఫర్లు

క్రిస్మస్, సంక్రాంతి పంగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి RV మురళీ కృష్ణ మంగళవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు కూడా ఉంటాయన్నారు. గంటస్తంభం, MG రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లిలో ఉన్న విక్రయ శాలల్లో లభిస్తాయన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలన్నారు.
News December 10, 2025
VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.
News December 10, 2025
VZM: ‘జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి’

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కేంద్రీయ గిరిజన వర్శిటీ, భోగాపురం విమానాశ్రయం, తోటపల్లి, తారకరామ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, కుర్ధారోడ్-విజయనగరం మూడో రైల్వే లైన్, కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్ భూ సేకరణ స్థితిపై సమీక్షించారు.


